మూసీ అభివృద్ధిలో భాగంగా నిర్వాసితులయ్యే వారికి ఇళ్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు(Orders) ఇచ్చింది. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుతో బాధితులయ్యే వారి పేరిట మొత్తం 16,002 డబుల్ బెడ్ రూంలు కేటాయించింది. దీనిపై CM రివ్యూ నిర్వహించగా.. రివర్ బెడ్(నదీ గర్భం), బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలకు పునరావాసం కల్పించేలా ఆదేశాలు వచ్చాయి. ఇప్పటికే అధికారులు నిర్వహించిన సర్వేలో 10,200 మందిని బాధితులుగా గుర్తించారు.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారుల బృందాలు రేపు(సెప్టెంబరు 25న) ఇంటింటికీ వెళ్లి.. కేటాయించే ఇళ్ల గురించి నిర్వాసితులకు తెలియజేస్తాయి. ముందుగా రివర్ బెడ్ ఆక్రమణలో ఉన్న 1,600 ఇళ్లను, ఆ తర్వాత బఫర్ జోన్లో నివసించే వ్యక్తులు, నిర్మాణాలకు RFCTLARR చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.