MBBS కౌన్సెలింగ్ ప్రక్రియ ఎల్లుండి(సెప్టెంబరు 26) నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి కన్వీనర్ కోటా ప్రొవిజనల్ మెరిట్ లిస్టును విడుదల చేశామని, వాటిపై అభ్యంతరాలుంటే బుధవారం సాయంత్రం 5 గంటల లోపు తెలపాలని కాళోజి నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ప్రకటించింది. అవసరమైన డాక్యుమెంట్స్ తో అభ్యంతరాల్ని మెయిల్ ద్వారా వర్సిటీకి పంపితే, వాటిని పరిశీలించి గురువారం నాడు ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేస్తామని తెలిపింది. అదే రోజు నుంచి వెబ్-ఆప్షన్ల(Web Options) నమోదుకు శ్రీకారం చుడుతుంది.
కన్వీనర్ కోటా కౌన్సెలింగ్ కోసం దరఖాస్తు(Apply) చేసుకున్నవారు వెబ్ ఆప్షన్ల నమోదుకు సిద్ధంగా ఉండాలని వర్సిటీ వైస్ ఛాన్సలర్ డా.కరుణాకర్ రెడ్డి సూచించారు. గతేడాదికి సంబంధించి కాలేజీ వారి సీట్ల అలాట్మెంట్ వివరాలు యూనివర్సిటీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిని పరిశీలించి వెబ్-ఆప్షన్ల కోసం ముందుగానే కళాశాలల లిస్టును సిద్ధం చేసుకుంటే.. నమోదు ప్రక్రియ సులభతరమవుతుందని తెలిపారు.