2008 DSC బీఈడీ అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆ DSCలో డీఈడీ అభ్యర్థులకు 30% SGTలు కేటాయించాలన్న నిర్ణయంతో నష్టపోయిన అభ్యర్థుల్ని కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించాలని(Recruitment) నిర్ణయించింది. 2008లో అర్హత(Qualify) సాధించి ఉద్యోగం దక్కని బీఈడీ అభ్యర్థులకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మినహా ఇతర జిల్లాల్లో పనిచేసేందుకు అవకాశం కల్పిస్తున్నది.
విద్యాశాఖ నుంచి వివరాలు సేకరించిన సర్కారు కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ పై ఆయా అభ్యర్థులకు సమాచారం చేరవేసింది. స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్(Website)లో కన్సెంట్ ఫామ్, వెరిఫికేషన్ ఫాంలు ఉంచిన విద్యాశాఖ.. ఇంట్రెస్ట్ గల క్యాండిడేట్స్ తమ వివరాల్ని వెబ్సైట్లో నమోదు చేసేందుకు అవకాశం కల్పించింది. ఈ నెల 27 నుంచి అక్టోబరు 5 వరకు DEOల ఆధ్వర్యంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరగనుంది. 2008 DSC బాధితుల సంఖ్య 2 వేల వరకు ఉంది.