అక్రమ(Illegal) నిర్మాణాలంటూ కూల్చివేతలకు పాల్పడుతున్న హైడ్రాతోపాటు దాని కమిషనర్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. శని, ఆదివారాలు ఇళ్లను ఎందుకు కూల్చివేస్తున్నారంటూ ప్రశ్నించింది. అమీన్ పూర్ కూల్చివేతల మీద దాఖలైన పిటిషన్లపై జరిగిన విచారణకు అక్కడి తహసీల్దార్ కోర్టుకు రాగా.. కమిషనర్ రంగనాథ్ వర్చువల్ విచారణకు హాజరయ్యారు. రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు చెప్పినంత మాత్రాన నిర్మాణాలు కూల్చివేయొద్దు అంటూ ఆదేశాలిచ్చింది.
హైడ్రా ఇదే విధంగా వ్యవహరిస్తే స్టే ఇవ్వాల్సి వస్తుందని హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. జీవో ప్రకారం హైడ్రాకు ఎన్ని పనులున్నాయని ప్రశ్నిస్తూ మిగతా వాటి గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని మండిపడింది. ప్రభుత్వ శాఖల(Departments) మధ్య సమన్వయ లోపంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని, రూల్స్ పాటించకపోతే హైడ్రా ఏర్పాటు జీవోపైనే స్టే ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది.