IIT సీటు సాధించడమంటే ఎంతో కష్టం. అలాంటిది ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి ప్రతిభ చూపించిన అతడికి.. రూ.17,500 డిపాజిట్ కూడా కట్టే పరిస్థితి లేదు. చివరకు అప్పోసప్పో చేసి అతడి తల్లిదండ్రులు తుది గడువు కన్నా 15 నిమిషాల ముందే డబ్బు తీసుకొచ్చారు. అప్పటికే టైం మించిపోయిందంటూ సదరు విద్యాలయం… అతడి సీటుకు ఎసరు పెట్టింది.
సుప్రీం జోక్యంతో…
అతుల్ కుమార్ అనే 18 ఏళ్ల దళిత యువకుడికి సీటును IIT ధన్ బాద్(Dhanbad) నిరాకరించింది. డిపాజిట్ చెల్లింపునకు ఆఖరు తేదీ జూన్ 24 సాయంత్రం 5 గంటలైతే.. ఆ రోజు 4:45కి డబ్బు రెడీ చేసుకున్నారు. కానీ మరో 15 నిమిషాలు ఉండగానే 4:45కే పోర్టల్ క్లోజ్ అయింది. తన ఆశలు అడియాసలు కావడంతో అతడు పిటిషన్ వేశాడు. గడువు కన్నా ముందే పోర్టల్ క్లోజ్ అయినట్లు చీఫ్ జస్టిస్(CJI) డి.వై.చంద్రచూడ్ గుర్తించారు.
ఆర్టికల్ 142 ప్రకారం ఇది విరుద్ధమన్న విద్యార్థి వాదనతో ఏకీభవించి అతడికి సీటు కేటాయించాలంటూ IIT ధన్ బాద్ ను ఆదేశించారు. అతణ్ని ‘బ్రైట్ స్టూడెంట్’ గా అభివర్ణించిన CJI.. సదరు విద్యార్థికి ‘ఆల్ ద బెస్ట్’ చెప్పారు. అతడికి ఇచ్చే సీటు వల్ల మరో విద్యార్థి నష్టపోకుండా సూపర్ న్యూమరరీ సీటును సృష్టించాలని ఆదేశాలిచ్చారు. IIT ఎంట్రన్స్ రాసేందుకు ఇదే అతడికి లాస్ట్ ఛాన్స్. కేవలం రెండుసార్లు మాత్రమే ఈ ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది.