స్పిన్నర్ వరుణ్ చక్రవర్తితోపాటు బౌలర్ల కట్టుదిట్ట(Tight) బౌలింగ్ తో బంగ్లాదేశ్ పెద్దగా స్కోరు చేయలేకపోయింది. క్రమం తప్పకుండా(Continue)గా వికెట్లు తీయడంతో గ్వాలియర్లో జరుగుతున్న తొలి టీ20లో తక్కువ స్కోరుకే పరిమితమైంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బంగ్లా 57 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి చివరకు 19.5 ఓవర్లలో 127కు ఆలౌటైంది.
ఓపెనర్లు పర్వేజ్(8), లిట్టన్ దాస్(4), తౌహిద్(12), మహ్మదుల్లా(1), జకీర్ అలీ(8) వెంటవెంటనే ఔటయ్యారు. శాంటో(27), మిరాజ్(35 నాటౌట్) ఆదుకోవడంతో ఆ మాత్రమైనా స్కోరు చేయగలిగింది. వరుణ్, అర్షదీప్ సింగ్ మూడేసి వికెట్లు తీసుకోగా మయాంక్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్య తలో వికెట్ దక్కించుకున్నారు.