పోలింగ్ ముగియడమే తరువాయి.. ఎగ్జిట్ పోల్స్ ఒకటే ఊదరగొట్టుడు. ఇక్కడ ఈ పార్టీ, అక్కడ ఆ పార్టీదే అధికారమంటూ హంగామా సృష్టిస్తాయి. కానీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ కరెక్ట్ కాదు అని జమ్మూకశ్మీర్, హరియాణా ఎన్నికల ఫలితాలు(Results) నిరూపించాయి. హరియాణాలో కాంగ్రెస్ దే అధికారమని ఎగ్జిట్ పోల్స్ ఘంటా భజాయించి చెప్పాయి. ఒక సర్వే 44-54 సీట్లు వస్తాయంటే, మరో సర్వే 55-62 దాకా రావొచ్చని అంచనా వేసింది. JKలో హంగ్ అని భావిస్తే అక్కడ ఒకే పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చేలా ఉంది.
హరియాణాలో కౌంటింగ్ మొదలైన తొలి రెండు గంటల వరకూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమనేలా కాంగ్రెస్ దూసుకుపోయింది. కానీ ఆ తర్వాతే మెల్లగా BJP లైన్లోకి వచ్చింది. కమలం పార్టీ ఏకంగా పీఠాన్ని ఎగరేసుకుపోయేలా సీట్లను గెలుచుకుంటోంది. ప్రస్తుతానికి BJP 46 స్థానాల్లో, కాంగ్రెస్ 39 స్థానాల్లో లీడ్ లో ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ అడ్రసే లేకపోగా.. INLD ఒక చోట, ఇతరులు నాలుగు చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. 90 సీట్లు గల సభలో 46 స్థానాలు గెలుచుకున్న పార్టీదే అధికారం.