గత కొన్నేళ్లుగా జరుగుతున్న రైలు(Train) ప్రమాదాలు(Accidents) భయానకంగా తయారవుతున్నాయి. గత ఐదేళ్లలో 17 జోన్ల పరిధిలో 200 ఘటనల్లో 351 మంది ప్రాణాలు కోల్పోతే 970 మంది గాయపడ్డట్లు రైల్వే లెక్కలు చెబుతున్నాయి. 2022-23లో రూ.1.2 లక్షల కోట్ల ఆదాయం వస్తే అందులో 13.5 శాతాన్ని మరమ్మతులకు వెచ్చించారు. కానీ 2023-24లో రాబడి రూ.1.5 లక్షల కోట్లకు పెరిగినా నిర్వహణకు మాత్రం 11% మాత్రమే ఖర్చు చేశారు.
కారణాలివే…
పేలవమైన ట్రాక్ నిర్వహణ… రద్దీ… కాలం చెల్లిన సిగ్నలింగ్ వ్యవస్థ… భారీవర్షాలు, కొండ చరియలు విరిగిపడటం… లోకో పైలెట్ల అలసట, అజాగ్రత్త(Careless)… తగినంత శిక్షణ లేకపోవడం… కమ్యూనికేషన్ లోపాలు… ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. కిక్కిరిసిపోతున్న రైళ్లు, గూడ్స్ ల్లో కెపాసిటీకి మించి లోడ్ చేయడం వల్ల ట్రాక్ పై భారం పడుతుందని తేలింది. ఈ ప్రమాదాలు తగ్గాలంటే 15,000 కిలోమీటర్ల మేర ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థను డెవలప్ చేయాల్సి ఉంది.