పంటలకు మద్దతు ధర, ఉద్యోగులకు DA పెంచుతూ నిర్ణయం తీసుకున్న కేంద్ర(Union) కేబినెట్.. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాశీ వద్ద గంగానదిపై భారీ వంతెన(Bridge)కి ఆమోదం తెలిపింది. ఉత్తర, తూర్పు, పశ్చిమ రాష్ట్రాల్ని కలిపేలా రోడ్డు, రైల్వే బ్రిడ్జికి నిధులు కేటాయించింది. ప్రస్తుతం రెండు లైన్ల రోడ్డు, మరో రెండు లైన్ల రైల్వే ఉన్న 137 సంవత్సరాల చరిత్ర గల మాలవీయ(Malviya) వంతెనను సరికొత్త రీతిలో ఆధునికీకరించబోతున్నది.
నాలుగు రైల్వే లైన్లు, ఆరు లైన్ల జాతీయ రహదారి ఉండేలా నిర్మించబోయే వంతెన కోసం రూ.2,642 కోట్లను మంత్రివర్గం కేటాయించింది. ఇది అందుబాటులోకి వస్తే ప్రతి సంవత్సరం 8 కోట్ల లీటర్ల డీజిల్ ఆదా కానుండగా, రూ.638 కోట్లు మిగులుతాయి.