వినాయకుడి పూజ సందర్భంగా తమ ఇంటికి ప్రధాని రావడంపై విమర్శలు(Criticises) వెల్లువెత్తిన వేళ భారత ప్రధాన న్యాయమూర్తి(CJI) డి.వై.చంద్రచూడ్ వివరణ ఇచ్చారు. పిల్లల పెళ్లిళ్లు, ఇతర వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు.. సుప్రీం, హైకోర్టుల CJలు, న్యాయమూర్తుల ఇళ్లను సందర్శించడం సహజమేనని గుర్తు చేశారు. ఇలా కలిసినప్పుడు న్యాయపరమైన విషయాల్ని చర్చించిన సందర్భాల్ని నేనెప్పుడూ చూడలేదని అన్నారు. కేంద్ర, రాష్ట్రాల కార్యనిర్వాహక అధిపతులు ఆహ్లాదాన్ని పంచుకోవడం మినహా మరే ఇతర విషయాలు చర్చకు తీసుకురారు అని స్పష్టం చేశారు.
ఈ భేటీల్లో న్యాయపర అంశాల ప్రస్తావనపై ప్రభుత్వాధినేతలకు, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న న్యాయమూర్తులకు పరిపక్వత(Maturity) ఉందని CJI తెలిపారు. ‘ప్రొటోకాల్ చాలా కఠినమైనది.. శుభకార్యాల సందర్భంగా జడ్జీలు, పాలనాధినేతలు తరచూ కలుస్తారు.. గణపతి పూజకు మోదీ రావడంపై విమర్శలు సరికాదు..’ అని CJI చంద్రచూడ్ వివరించారు.