జన్వాడ ఫాం హౌజ్ పార్టీ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ పాకాల రెండు రోజుల్లో పోలీసుల ఎదుట హాజరు కావాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఆయన వేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ జరగ్గా.. చట్ట ప్రకారమే ముందుకెళ్లాలని పోలీసులకు స్పష్టం చేసింది. ఫాంహౌజ్ లో జరిగిన పార్టీపై ఎక్సైజ్ పోలీసులు దాడి చేయగా.. A1 నిందితుడైన రాజ్ పాకాల కనిపించకుండా పోయారు.
రాజ్ పాకాలకు పోలీసులు నోటీసులివ్వడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటివరకు ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదన్న అదనపు అడ్వకేట్ జనరల్(AAG) ఇమ్రాన్ ఖాన్.. ఇందులో రాజకీయ ప్రమేయం లేదని కోర్టుకు వివరించారు. KTR బావమరిది అన్న కారణంతోనే కేసు పెట్టారని, డ్రగ్స్ పరీక్షలకు శాంపుల్స్ ఇవ్వాలంటూ మహిళల్ని ఇబ్బంది పెట్టారని రాజ్ పాకాల తరఫు న్యాయవాది తెలిపారు. ఇరువర్గాల వాదనల్ని పరిశీలించిన న్యాయస్థానం… పోలీసుల ఎదుట హాజరు కావడానికి రెండ్రోజుల సమయమిస్తూ ఆదేశాలిచ్చింది.