
రాష్ట్రంలోని పలువురు IFS అధికారులను బదిలీ చేస్తూ మరికొందరికి ప్రమోషన్లు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చింది. వైల్ట్ లైఫ్ PCCF, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ గా లోకేశ్ జైస్వాల్, హరితహారం PCCFగా సువర్ణ, అటవీ ఉత్పత్తుల చీఫ్ కన్జర్వేటర్ గా రామలింగం, జూపార్కుల డైరెక్టర్ గా V.S.N.V.ప్రసాద్ ను నియమించారు. ఇక భద్రాద్రి DFO లక్ష్మణ్ రంజిత్ నాయక్ ను ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు పంపిస్తూ ఆయన స్థానంలో కిష్టగౌడ్ కు బాధ్యతలు కట్టబెట్టింది.