దిల్లీ సమీపంలోని యమునా నది(River) మరింత డేంజరస్ గా ప్రవహిస్తోంది. 207.55 మీటర్లతో ఈ రోజు సాయంత్రానికే రికార్డు స్థాయిలో ఫ్లడ్ రాగా.. ఇప్పుడు దాన్ని కూడా అధిగమించి 208.05 మీటర్లకు చేరుకుంది. రాత్రి 10 గంటలకు 208 మీటర్లు దాటి డేంజరస్ సిట్యుయేషన్ కు చేరుకుందని సెంట్రల్ వాటర్ కమిషన్(CWC) హెచ్చరించింది. వరద ముంచెత్తే ప్రమాదం ఉన్న సివిల్ లైన్ జోన్(Civil line zone) పరిధిలో గల లోతట్టు ప్రాంతాల్లోని 10 స్కూళ్లు, షహద్రాలోని 7 స్కూళ్లను మూసివేశారు.
యమునా నదిలో 206 మీటర్ల ప్రవాహమే గరిష్ఠం కాగా… అంతకు 2 మీటర్లు ఎక్కువగా ఫ్లడ్ వస్తోంది. దీంతో దిల్లీ సర్కారు అప్రమత్తమై ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించింది. CM అరవింద్ కేజ్రీవాల్ ఎప్పటికప్పుడు స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తున్నారు.