ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్ఠ దెబ్బతింటున్నదని, పేదలకు విశ్వాసం కల్పించేలా బడుల్ని తీర్చిదిద్దే బాధ్యత అందరిపై ఉందని CM రేవంత్ రెడ్డి అన్నారు. కలెక్టర్లు, ఇతర జిల్లా స్థాయి అధికారులు(Officials) వారంలో రెండు రోజుల పాటు ప్రభుత్వ పాఠశాలలతోపాటు గురుకులాలు, మోడల్ స్కూళ్ల నిర్వహణను పరిశీలించి విద్యార్థుల్ని కలవాలని బాలల దినోత్సవం సందర్భంగా ఆదేశించారు. బడుల్ని పర్యవేక్షించని అధికారుల్ని ప్రమోషన్లు, బదిలీ(Transfers)ల విషయంలో పరిగణలోకి తీసుకుంటామని హెచ్చరించారు.
జిల్లా అధికారులతోపాటు MPలు, MLAలు, ఇతర ప్రజాప్రతినిధులు సైతం స్కూళ్లను సందర్శించాలని, లీడర్లు వెళ్లలేకపోతే అలాంటి వారిని పదవులకు దూరంగా పెడతామన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకున్న అర్హత ప్రైవేటు టీచర్లకు లేకున్నా పిల్లల్ని ప్రైవేటు స్కూళ్లకే పంపించేందుకు ఇష్టపడుతున్నారని గుర్తు చేశారు. నాసిరకం భోజనాలు పెట్టిన వ్యక్తుల్ని కటకటాల(Jail) వెనక్కు పంపించండంటూ వేదికపై నుంచే ఉన్నతాధికారుల్ని ఆదేశించారు.