దేశ రాజధాని ఢిల్లీ ప్రపంచంలో(World’s)నే అత్యంత ప్రమాదకర సిటీగా మారింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(AQI) తీవ్రత 498గా నమోదై ప్రకంపనలకు కారణమైంది. దీంతో పాకిస్థాన్ లాహోర్ తర్వాత ప్రపంచంలోనే రెండో అత్యంత డేంజరస్ సిటీగా ఢిల్లీ నిలించింది. లాహోర్ లో వాయు కాలుష్యం తీవ్రత 770గా ఉంది. హస్తినలోని ఐదు ప్రాంతాలు జహంగీర్ పురి(458), బవానా(455), వాజిర్ పూర్(455), రోహిణి(452), పంజాబీబాగ్(443) తీవ్రతతో ఉన్నాయని ఐక్యూఎయిర్(IQAir) అనే స్విట్జర్లాండ్ సంస్థ ర్యాంకులు కేటాయించింది.
గ్రాప్-3ని అమలు చేయాలని ప్రభుత్వానికి ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్(CAQM) సూచించింది. ఈ GRAP-3 నిబంధనల ప్రకారం BS-3 పెట్రోలు వాహనాలు, BS-4కు చెందిన డీజిల్ వెహికిల్స్ ను ఢిల్లీలోకి అనుమతించబోరు. ప్రాథమిక(Primary) పాఠశాలల్ని మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఐదో తరగతి వరకు గల పిల్లలు స్కూళ్లకు రావాల్సిన అవసరం లేకుండా కేవలం ఆన్లైన్ విధానంలోనే తరగతులు బోధించాలని స్పష్టం చేసింది. ఇంధనంతో నడిచే పరిశ్రమలు మూతపడగా, ఎలాంటి నిర్మాణ కార్యక్రమాలు చేపట్టొద్దని ఢిల్లీ సర్కారు ఆదేశాలిచ్చింది.