శరీరంపై పొడిపించుకున్న పచ్చబొట్లు(Tattoos) ప్రాణాలనే ప్రమాదకరంగా మార్చాయి. టాటూస్ వేయించుకున్న మహిళల్లో 68 మందిలో HIV పాజిటివ్ బయటపడింది. ప్రసవానికి ముందు(Prenatal) జరిపే పరీక్షల్లో HIV పాజిటివ్ ఉన్నట్లు తేలింది. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ జిల్లా ఆసుపత్రిలో 20 మంది మహిళలకు పాజిటివ్ వచ్చినట్లు అక్కడి డాక్టర్లు తెలిపారు.
రోడ్డు పక్కన గల సెంటర్లలో టాటూస్ వేయించుకోగా, బాధిత మహిళల హెల్త్ క్రమంగా క్షీణించడం మొదలైంది. అనుమానంతో పరీక్షించి చూస్తే సదరు మహిళలందరికీ పాజిటివ్ తేలింది. టాటూస్ వేసిన వ్యక్తి అందరికీ ఒకే సూది ఉపయోగించడం వల్లే ఇలా జరిగిందని అనుమానిస్తున్నారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భారతీయ మహిళలు టాటూలపై ఎందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.