ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న రాజ్యాంగేతర శక్తిగా మారారని, ఆయన ఫోన్లో ఆదేశిస్తే అధికారులు పాటిస్తున్నారని మాజీ మంత్రి KTR విమర్శించారు. గతంలో ఫార్మా కంపెనీలను విమర్శించిన రేవంత్ ఇప్పుడు వాటి కోసం వేల ఎకరాలు కావాలంటూ ఎందుకడుగుతున్నారని ప్రశ్నించారు. లగచర్ల రైతులను పరామర్శించేందుకు KTR.. సంగారెడ్డి జైలుకు వెళ్లారు. కొడంగల్ ను తన అల్లుడి ఫార్మా కంపెనీకి రాసివ్వాలన్నదే అసలు లక్ష్యమంటూ రేవంత్ కుటుంబంపై విమర్శలు చేశారు. తాము అధికారంలోకి వచ్చాక రేవంత్ ను ఏం చేయాలో మాకు తెలుసంటూ మాట్లాడారు.