స్వదేశంలో నిర్వహించే టోర్నమెంటు విషయంలో ఓవరాక్షన్ కు దిగిన పాకిస్థాన్ కు ICC చుక్కలు చూపించింది. భారత్ పాల్గొనబోయే ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచుల్ని పాక్ ఆక్రమిత కశ్మీర్(POK)లోని స్కర్దు(Skardu), ముర్రే(Murree), ముజఫరాబాద్ లో జరపాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని భారత్ ఖండించి దాయాది దేశానికి వెళ్లేది లేదంటూ ICCకి ఫిర్యాదు చేసింది. ఈ నెల 16 నుంచి 24 వరకు ఛాంపియన్స్ ట్రోఫీని పాక్ వ్యాప్తంగా ప్రదర్శనకు ఉంచబోతున్నారు.
వచ్చే ఏడాది జరగనున్న ఈ టోర్నీ కోసం ఇలా POKని వాడుకోవాలన్న ఆకస్మిక నిర్ణయంతో భారత్ తీవ్రంగా స్పందించింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న ICC.. పాక్ ఆక్రమిత కశ్మీర్ మ్యాచుల షెడ్యూల్ రద్దు చేసింది. అయితే తమ టీంను పంపబోమన్న భారత్ ను వివరణ కోరింది. మోదీ సర్కారు నిర్ణయం మేరకే టీమ్ఇండియా అక్కడ అడుగుపెట్టడం ఆధారపడి ఉంది. గతేడాది ఆసియా కప్ కు పాక్ ఆతిథ్యమివ్వగా, హైబ్రిడ్ మోడల్లో నిర్వహించిన మ్యాచులకు గాను శ్రీలంకలోని స్టేడియాల్లోనే భారత్ ఆడింది.