ఆస్ట్రేలియాతో జరిగే తొలి టెస్టు మ్యాచ్ కు రోహిత్ శర్మ అందుబాటులో(Unavailable) లేకుంటే అతడి స్థానంలో జస్ప్రీత్ బుమ్రా బాధ్యతలు చేపట్టే అవకాశముంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ లో ఈ నెల 22న ఫస్ట్ మ్యాచ్ మొదలవుతుంది. తాను ఈ మ్యాచ్ కు అందుబాటులో ఉండటం లేదని ఇప్పటికే BCCIకి రోహిత్ తెలిపినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. రోహిత్-రితిక సజ్దే జంటకు రెండో సంతానంగా బాబు జన్మించినందున మరికొన్ని రోజులు సతీమణి వద్దే ఉండాలని భారత కెప్టెన్ భావించినందున.. పెర్త్ మ్యాచ్ కు ఇక బుమ్రానే సారథ్యం(Captaincy) వహిస్తాడు.
ఆడిలైడ్ లో జరిగే రెండో టెస్టు కోసం రోహిత్ ఆసీస్ వెళ్తాడు. మొదటి, రెండు టెస్టుల మధ్య తొమ్మిది రోజుల గ్యాప్ ఉంది. హైదరాబాద్ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డికి ఈ మ్యాచ్ లో ఆడే అవకాశాలున్నాయి. పిచ్ ఎక్స్ ట్రా బౌన్స్ కు అనుకూలిస్తున్నందున నాలుగో సీమర్ గా అతను టీమ్ఇండియా క్యాప్ అందుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఆదివారం నాడు KL రాహుల్ సైతం నెట్ ప్రాక్టీస్ లో పాల్గొన్నాడు.