ఢిల్లీలో వాయు కాలుష్యం(Air Pollution) మరింత ప్రమాదకర స్థాయికి చేరింది. రెండ్రోజుల క్రితం 400కు చేరుకున్న ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(AQI) ఆదివారం సాయంత్రానికి గరిష్ఠంగా 457కు చేరుకుంది. తొలుత 447, ఆ తర్వాత 452, సాయంత్రం ఐదు గంటలకు అది కాస్తా 457కు చేరుకున్నట్లు కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్(CAQM) ప్రకటించింది. ఇప్పటివరకు స్టేజ్-3 గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తుండగా.. సివియర్+ కేటగిరీకి చేరినందున సోమవారం నుంచి స్టేజ్-4ను అమలు చేస్తారు. ఇప్పటికే BS-3 పెట్రోలు వాహనాలు, BS-4 డీజిల్ వాహనాల్ని దేశ రాజధాని రీజియన్ లోని నిషేధించిన ఢిల్లీ సర్కారు.. అన్ని రకాల భవన నిర్మాణాలను నిలిపివేసింది.