బుల్డోజర్లతో కూల్చివేతల(Demolishes)పై దేశవ్యాప్తంగా సంచలనానికి కారణమైన ఉత్తరప్రదేశ్ CM యోగి ఆదిత్యనాథ్.. తన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ వాటి గురించే ప్రస్తావిస్తున్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ బుల్డోజర్ కూల్చివేతలు ఉండకూడదంటూ సుప్రీంకోర్టు చెప్పిన ఐదు రోజులకే ఆయన మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. జార్ఖండ్ జామ్తారాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహించిన యోగి.. హేమంత్ సోరెన్ సర్కారు అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. కేంద్ర నిధులన్నీ దారి మళ్లించిన వ్యక్తుల నుంచి తిరిగి రాబట్టాలంటే UP మాదిరిగా బుల్డోజర్ చర్యలకు దిగాల్సిందేనని స్పష్టం చేశారు.
బంగ్లాదేశ్ నుంచి వస్తున్న రోహింగ్యాలకు ఆశ్రయం కల్పిస్తూ మహిళలు, భూములు, తినే రొట్టెను సైతం వారికి తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. ఈ నెల 20న జార్ఖండ్ లో రెండో విడత పోలింగ్ జరగనుండగా, స్టార్ క్యాంపెయినర్ గా UP CM ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.