హైదరాబాద్ నగరానికి మణిహారంగా భావిస్తున్న రీజినల్ రింగ్ రోడ్డు(RRR) విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. RRR దక్షిణ భాగంలో భూముల్ని సేకరించే ముందు వాటి ధరల్ని(Prices) సవరించాలని ఆదేశాలిచ్చింది. ఈ మేరకు అవసరమైన భూముల విషయంలో ధరల్ని సవరించాలంటూ ఆరు జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. బహిరంగ మార్కెట్ ఆధారంగా సవరణ ఉండాలంటూ మహబూబ్ నగర్, వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల కలెక్టర్లకు స్పష్టం చేసింది.
ఈ సవరణకు సంబంధించి జీవోను రహదారులు, భవనాల శాఖ(R&B) విడుదల చేసింది. ఔటర్ రింగ్ రోడ్డు(ORR) వెలుపల రెండు భాగాలుగా నిర్మించే RRR కోసం 347.84 కిలోమీటర్ల రోడ్డు వేస్తారు. NH 44, NH 65 సహా 17 జాతీయ, రాష్ట్ర రహదారులతోపాటు పలు జిల్లాల్లో 20 పట్టణాల్ని దీనికి లింక్ చేస్తారు.