స్టాక్ మార్కెట్లు మంగళవారం నాడు దూసుకుపోతున్నాయి. BSE సెన్సెక్స్, NSE నిఫ్టీ భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 1,000 పాయింట్లకు పైగా, నిఫ్టీ 300 పాయింట్ల మేర లాభాల్లో ఉన్నాయి. సెన్సెక్స్ 78,144.68 పాయింట్లకు చేరుకుని 1.04% మేర 806 పాయింట్లు, నిఫ్టీ 23,699.60కు చేరి 1.05%తో 280 పాయింట్లకు పైగా లాభాల్ని నమోదు చేశాయి. సోమవారం దేశీయ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని కొనసాగించాయి. US మార్కెట్లు మిక్స్ డ్ ట్రెండ్ ను కొనసాగిస్తుండగా, ఆసియా మార్కెట్లు లాభాల బాటలో నడుస్తున్నాయి.