ప్రముఖ పారిశ్రామికవేత్త(Industrialist) గౌతమ్ అదానీ కంపెనీలకు భారీ నష్టం కలిగింది. స్టాక్ మార్కెట్లలో ఆయన కంపెనీల షేర్లు సుమారు 20% మేర పడిపోయాయి. సౌర విద్యుత్తు(Solar Energy) కాంట్రాక్టుల కోసం 265 మిలియన్ డాలర్ల లంచం ఇచ్చినట్లు అదానీతోపాటు మరో ఏడుగురిపై న్యూయార్క్ లో ఛార్జిషీట్స్ నమోదు కావడంతో కంపెనీలన్నీ నష్టాల్లో కూరుకుపోయాయి. రాబోయే 20 ఏళ్లల్లో 2 బిలియన్ డాలర్లు లాభం పొందేందుకు US ఇన్వెస్టర్ల నుంచి అక్రమంగా పెట్టుబడులు స్వీకరించడం, లంచం ఇచ్చారనే ఆరోపణలతో అదానీ కంపెనీలపై US సెక్యూరిటీస్ అండ్ ఎక్ఛేంజ్ కమిషన్ కేసులు ఫైల్ చేసింది.
అదానీ గ్రీన్ ఎనర్జీ 19.17%, అదానీ టోటల్ గ్యాస్ 18.14%, అదానీ పవర్ 17.79%, అదానీ పోర్ట్స్ 15%, అంబుజా సిమెంట్స్ 14.99%, ACC 14.54%, NDTV 14.37%, అదానీ విల్మర్ 10% శాతం మేర తగ్గిపోయాయి. ఈ కేసులపై అదానీ.. సివిల్ లా సూట్ వేశారు. 11 కంపెనీల ద్వారా నష్టపోయిన సంపద రూ.2 లక్షల కోట్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు. 2023లో హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదిక తర్వాత ఈ స్థాయిలో ఆయన కంపెనీల షేర్లు పతనం కావడం ఇదే తొలిసారి.