ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న గ్రూప్-2 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం హాల్ టికెట్లు రెడీ అయ్యాయి. డిసెంబరు 9 నుంచి వీటిని అందుబాటులో ఉంచుతున్నట్లు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) తెలిపింది. కమిషన్ వెబ్ సైట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్(Download) చేసుకోవచ్చు. అదే నెల 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు జరుగుతాయి. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తుండగా.. మొత్తం 783 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు అయిదున్నర లక్షల మంది దరఖాస్తు(Apply) చేసుకున్నారు.