ప్రపంచవ్యాప్తంగా సంచలనం(Sensational) సృష్టించిన అదానీ కేసు వ్యవహారంలో నిన్నటికి, నేటికీ పరిస్థితిలో క్రమంగా మార్పు వస్తున్నది. నిన్నంతా నష్టాల్లో కూరుకుపోయిన అదానీ షేర్లు ఈరోజు లాభాల(Profit) బాట పట్టాయి. సౌర విద్యుత్తు ప్రాజెక్టుకు గాను లంచం ఇచ్చారంటూ న్యూయార్క్ లో అదానీ గ్రూప్ పై కేసు ఫైల్ కావడంతో రెండ్రోజులుగా గందరగోళం కనిపించింది. కానీ అతి తక్కువ సమయంలోనే గ్రూప్ షేర్లు లాభాల బాటలోకి మళ్లాయి. ప్రస్తుతానికి ఆయన గ్రూప్ షేర్లు 6% మేర లాభాల్లో కొనసాగుతున్నాయి.
అమెరికా కేసుతో అదానీ గ్రూపులన్నీ నష్టాల్లో కూరుకుపోయి ఆయన సంపదలో రూ.2.45 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. కానీ ఒక్కరోజులోనే పరిస్థితిలో మార్పు కనిపించి షేర్లన్నీ తిరిగి పుంజుకుంటున్నాయి.