పెర్త్ టెస్టు పేసర్ల(Seemers)కు స్వర్గధామంలా తయారవడంతో బ్యాటర్లు చేతులెత్తేస్తున్నారు. భారత్ ను తక్కువ(Low) స్కోరుకే ఆలౌట్ చేశామన్న ఆనందంలో ఉన్న ఆస్ట్రేలియాను టీమ్ఇండియా దెబ్బతీసింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 150కి ఆలౌటైతే.. ప్రత్యర్థుల్ని బుమ్రా సేన గడగడలాడించింది. 59 పరుగుల వద్దే ఆస్ట్రేలియా ఏడో వికెట్ కోల్పోయింది. తొలి ఓవర్ నుంచే బౌలర్లు గడగడలాడించడంతో 38 స్కోరుకే ఆసీస్ ఐదు వికెట్లు చేజార్చుకుంది. బుమ్రా 4, సిరాజ్ 2, హర్షిత్ రాణా ఒక వికెట్ తీసుకున్నారు. ఒక్కరోజులోనే 17 వికెట్లు నేలకూలితే అవన్నీ పేసర్లకే దక్కాయి.
ఖవాజా(8), నాథన్ మెక్ సీనీ(10), లబుషేన్(2), స్మిత్(0), ట్రావిస్ హెడ్(11), మార్ష్(6), కమిన్స్(3) క్రీజులో కుదురుకోకుండానే ఔటయ్యారు. బుమ్రా, సిరాజ్, రాణా పోటీపడి మరీ బంతులు వేస్తూ కంగారూలనూ కంగారెత్తించారు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 67/7తో ఉండగా… ప్రస్తుతానికి ఆ జట్టుపై 83 పరుగుల ఆధిక్యంలో ఉంది టీమ్ఇండియా.