రాష్ట్రంలో 26 సమీకృత(Integrated) గురుకుల పాఠశాలలు(Residential Schools ) మంజూరు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ యంగ్ ఇండియా గురుకులాల్ని రెండో విడతలో 26 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తారు. తొలి విడతలో ఇప్పటికే 28 సెగ్మెంట్లలో పాఠశాలల్ని మంజూరు చేయగా, వాటిని వచ్చే విద్యాసంవత్సరం లోగా పూర్తి చేయాలన్నది లక్ష్యం.