ఆస్ట్రేలియా గడ్డపై భారత ఓపెనర్లు రికార్డు సృష్టించారు. తొలి వికెట్(First Wicket)కు 201 పరుగుల పార్ట్నర్ షిప్ తో 38 రికార్డును అధిగమించారు. 1986లో సునీల్ గవాస్కర్-కృష్ణమాచారి శ్రీకాంత్ జోడీ 191 పరుగులు చేయగా ఆ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. 90 రన్స్ తో బ్యాటింగ్ ప్రారంభించిన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కొద్దిసేపటికే సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్(77) ఔట్ కావడంతో 201 స్కోరు వద్ద తొలి వికెట్ ను టీమ్ఇండియా కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్ లో బుమ్రా సేన 150కి ఆలౌటైతే కంగారూలు 104కే చేతులెత్తేయడంతో టీమ్ఇండియాకు 46 పరుగుల ఆధిక్యం లభించింది. మొత్తంగా 250 పరుగులకు పైగా లీడ్ లో ఉంది భారత జట్టు.