పెర్త్ టెస్టులో నిలకడైన బ్యాటింగ్ తో టీమ్ఇండియా(Team India) పట్టుబిగించింది. తొలుత జైస్వాల్-రాహుల్ జోడీ, ఆ తర్వాత కోహ్లి-సుందర్ పట్టువదలకుండా ఆడటంతో భారీ ఆధిక్యం( Huge Lead) సంపాదించింది. కోహ్లి సెంచరీ దిశగా అడుగులేస్తుంటే ఎనిమిదో నంబర్లో వచ్చిన నితీశ్ కుమార్ రెడ్డి స్పీడ్ గా ఆడుతున్నాడు. 450 స్కోరు దాటిన భారత్ తొలి ఇన్నింగ్స్ లీడ్ కలిపి 500 మార్క్ దాటింది.
అంతకుముందు లంచ్ విరామం తర్వాత జైస్వాల్(161) ఔటయ్యాడు. అనంతరం పడిక్కల్(25) కొద్దిసేపు నిలబడితే రిషబ్ పంత్(1), ధ్రువ్ జురెల్(1) నిరాశపరిచారు. 275/2తో ఉన్న జట్టు కాస్తా 321/5కు చేరుకుంది. కానీ మరో ఎండ్ లో కోహ్లి పట్టుదలతో ఆడుతుండటం, మొదట సుందర్(29)తో ఆ తర్వాత నితీశ్ జత కావడంతో భారత్ భారీ స్కోరు దిశగా సాగింది.