
IPL-2025 మెగా వేలంలో ఆరంభమే అదిరిపోయింది. తొలుత పేస్ బౌలర్ అర్షదీప్ సింగ్ ను రూ.18 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేయగా, అతణ్ని మించి శ్రేయస్ అయ్యర్ అమ్ముడుపోయాడు. బేస్ ప్రైజ్ రూ.2 కోట్లతో స్టార్ట్ అయిన వేలం పంజాబ్ కింగ్స్, ఢిల్లీ మధ్య హోరాహోరీ పాట నడిచింది.
| ప్లేయర్ | ఫైనల్ ప్రైజ్ | కొన్న ఫ్రాంచైజీ |
| రిషభ్ పంత్ | రూ.27 కోట్లు | లఖ్నవూ సూపర్ జెయింట్స్(LSG) |
| శ్రేయస్ అయ్యర్ | రూ.26.75 | పంజాబ్ కింగ్స్(PBK) |
| అర్షదీప్ సింగ్ | రూ.18 కోట్లు | పంజాబ్ కింగ్స్(PBK) |
| జోస్ బట్లర్ | రూ.15.75 కోట్లు | గుజరాత్ టైటాన్స్(GT) |
| మిచెల్ స్టార్క్ | రూ.11.75 కోట్లు | ఢిల్లీ క్యాపిటల్స్(DC) |
| కగిసో రబాడ | రూ.10.75 కోట్లు | గుజరాత్ టైటాన్స్(GT) |
| మహ్మద్ షమీ | రూ.10 కోట్లు | సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) |
| డేవిడ్ మిల్లర్ | రూ.7.5 కోట్లు | లఖ్నవూ సూపర్ జెయింట్స్(LSG) |