అతిపెద్ద యాక్సిడెంట్ తో ఏడాదికి పైగా మంచాని(Bed)కే పరిమితమై తిరిగి అడుగుపెట్టిన రిషభ్ పంత్.. అంతర్జాతీయ క్రికెట్లోనే కాదు IPLల్లోనూ తన మార్క్ ను చూపిస్తున్నాడు. అతడి కోసం సన్ రైజర్స్ హైదరాబాద్(SRH), లఖ్నవూ సూపర్ జెయింట్స్(LSG), ఢిల్లీ క్యాపిటల్స్(DC) విపరీతంగా పోటీ పడ్డాయి. అప్పటికే అర్షదీప్ సింగ్ రూ.18 కోట్లకు అమ్ముడైతే అతణ్ని మించి శ్రేయస్ అయ్యర్ రూ.26.75 కోట్లు పలికాడు. ఈ ఇద్దర్నీ మించి పంత్ అమ్ముడుపోయాడు. అతడి ధర రూ.20.75 కోట్ల నుంచి ఏకంగా రూ.27 కోట్లకు పెరిగిపోయింది. అతణ్ని అంత భారీ ధరకు లఖ్నవూ సూపర్ జెయింట్స్ దక్కించుకుంది.
ప్లేయర్ | ఫైనల్ ప్రైజ్ | కొన్న ఫ్రాంచైజీ |
రిషభ్ పంత్ | రూ.27 కోట్లు | లఖ్నవూ సూపర్ జెయింట్స్(LSG) |
శ్రేయస్ అయ్యర్ | రూ.26.75 | పంజాబ్ కింగ్స్(PBK) |
అర్షదీప్ సింగ్ | రూ.18 కోట్లు | పంజాబ్ కింగ్స్(PBK) |
జోస్ బట్లర్ | రూ.15.75 కోట్లు | గుజరాత్ టైటాన్స్(GT) |
యజువేంద్ర చాహల్ | రూ.18 కోట్లు | పంజాబ్ కింగ్స్(PBK) |
మహ్మద్ సిరాజ్ | రూ.12.25 కోట్లు | గుజరాత్ టైటాన్స్(GT) |
మిచెల్ స్టార్క్ | రూ.11.75 కోట్లు | ఢిల్లీ క్యాపిటల్స్(DC) |
కగిసో రబాడ | రూ.10.75 కోట్లు | గుజరాత్ టైటాన్స్(GT) |
మహ్మద్ షమీ | రూ.10 కోట్లు | సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) |
లియామ్ లివింగ్ స్టోన్ | రూ.8.75 కోట్లు | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) |
డేవిడ్ మిల్లర్ | రూ.7.5 కోట్లు | లఖ్నవూ సూపర్ జెయింట్స్(LSG) |