కొండగట్టు ఆలయ(Temple) అభివృద్ధి కోసం స్పెషల్ అథారిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. యాదాద్రి మాదిరిగా కొండగట్టును డెవలప్ చేయాలని నిర్ణయించగా… ఐదారు వందల కోట్లయినా వెచ్చిస్తామని గతంలో పర్యటించిన సందర్భంగా CM కేసీఆర్ మాట ఇచ్చారు. ఈ టెంపుల్ మాస్టర్ ప్లాన్ బాధ్యతలను యాదాద్రి ఆలయం మాస్టర్ ప్లాన్ తయారు చేసిన వారికే సర్కారు అప్పగించింది. డెవలప్ మెంట్ వర్క్స్ పరిశీలనకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులు డిసైడయ్యారు. ఇప్పటికే యాదాద్రి, వేములవాడకు టెంపుల్ డెవలప్ మెంట్ అథారిటీలు ఉన్నాయి.
ఇప్పుడు కొండగట్టుకు కూడా టెంపుల్ డెవలప్ మెంట్ అథారిటీ(TDA) ఉండేలా ప్లాన్ తయారు చేస్తున్నారు. ఈ మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్(Draft)ను ఈ నెల చివరి వారంలోగా సిద్ధం చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ప్లాన్ కు అనుగుణంగా డెవలప్ మెంట్ వర్క్స్ కి బడ్జెట్ అంచనాలు తయారయ్యే అవకాశం ఉంది.