కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(CSR) కింద తెలంగాణకు అదానీ గ్రూప్ ఇస్తామన్న రూ.100 కోట్ల విరాళాన్ని తిరస్కరిస్తున్నట్లు(Reject) CM రేవంత్ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా అదానీ గ్రూపులపై జరుగుతున్న పరిణామాల్ని చూశాక ఈ నిర్ణయం తీసుకున్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని వివాదాల్లోకి లాగడం ఇష్టం లేదని, అందుకే ఈ విరాళాన్ని తిరస్కరిస్తున్నామన్నారు.
దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు సీనియర్ IAS అధికారి జయేశ్ రంజన్ లెటర్ రాశారన్నారు. రూ.100 కోట్ల నిధుల్ని స్కిల్ యూనివర్సిటకి బదిలీ చేయొద్దంటూ అందులో తెలిపినట్లు CM వివరించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న వివాదంలో తెలంగాణకు సంబంధం లేదని గుర్తు చేశారు.