అన్ని ఫార్మాట్లలో సత్తా(Talent) చాటుతున్న యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కెరీర్లోనే అత్యుత్తమ(Best) ర్యాంకుకు చేరుకున్నాడు. ఇంకొక్క అడుగేస్తే చాలు.. ప్రపంచంలోనే నంబర్ వన్ గా నిలుస్తాడు. ఆస్ట్రేలియాతో రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ(161) చేసిన అతడు.. టెస్టుల్లో భారీగా పరుగులు చేస్తూనే ఉన్నాడు. ICC విడుదల చేసిన టెస్ట్ బ్యాటర్ ర్యాంకింగ్స్ లో రెండో స్థానానికి చేరుకున్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు నాలుగో స్థానంలో ఉన్న యశస్వి.. సూపర్ సెంచరీతో రెండో ప్లేస్ దక్కించుకున్నాడు. బౌలింగ్ లో టాపర్ గా బుమ్రా, ఆల్ రౌండర్లలో నంబర్ వన్ గా రవీంద్ర జడేజా నిలిచారు.
ఆటగాళ్లు, ర్యాంకులిలా…
1. జో రూట్(ఇంగ్లండ్) – 903 పాయింట్లు
2. యశస్వి జైస్వాల్(భారత్) – 825
3. కేన్ విలియమ్సన్(న్యూజిలాండ్) – 804
4. హ్యారీ బ్రూక్(ఇంగ్లండ్) – 778
5. డారిల్ మిచెల్(న్యూజిలాండ్) – 743
6. రిషభ్ పంత్(భారత్) – 736
7. స్టీవ్ స్మిత్(ఆస్ట్రేలియా) – 726
8. సౌద్ షకీల్(పాకిస్థాన్) – 724
9. కమిందు మెండిస్(శ్రీలంక) – 716
10. ట్రావిస్ హెడ్(ఆస్ట్రేలియా) – 713