అప్పటిదాకా కుటుంబ సభ్యుల మధ్య ఉత్సాహంగా కనిపించిన పిల్లల్లో ఒకరు హఠాత్తుగా కిందపడిపోయారు. పట్టుమని పదేళ్లు కూడా నిండని ఆ చిన్నారి.. గుండెపోటుతోనే ప్రాణాలు కోల్పోయిందని గుర్తించారు. వయసు(Age)తో సంబంధం లేకుండా గుండెపోట్లు కలవరపెడుతున్నాయనడానికి ఈ చిన్నారే ప్రత్యక్ష నిదర్శనం(Example)గా నిలిచింది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రోటిగూడ గ్రామానికి చెందిన పదేళ్ల బాలిక దిగుట్ల సమన్విత హార్ట్ ఎటాక్ తో ప్రాణాలు కోల్పోయింది. పొద్దున స్కూల్ కు వెళ్లేందుకు రెడీ అవుతున్న సమయంలో ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది.
ఆమె తండ్రి వెంటనే లోకల్ హాస్పిటల్ కు తీసుకెళ్లి చికిత్స అందించినా ప్రయోజనం లేకుండా పోయింది. గుండెపోటుతోనే చిన్నారి మృతిచెందిందని డాక్టర్లు చెప్పారు. లక్షెట్టిపేటలోని స్కూల్లో సమన్విత నాలుగో తరగతి చదువుతున్నది. రెండు వారాల క్రితం ఇదే జిల్లా చెన్నూరులో పన్నెండేళ్ల అమ్మాయి సైతం హార్ట్ ఎటాక్ తోనే ప్రాణాలు విడిచింది. ఇలా 15 రోజుల వ్యవధిలోనే ఒకే జిల్లాలో జరిగిన రెండు ఘటనలు విషాదాన్ని నింపాయి.