
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి నటించిన చిత్రం ‘బ్రో’. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో విజయం సాధించిన ‘వినోదయ సిత్తం’ సినిమాకు తెలుగు రీమేక్. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్‌ప్లే, మాటలు అందించారు. జులై 28న విడుదల కానుండగా.. ఇప్పుడు ఈ మూవీ బిజినెస్ హాట్ టాపిక్‌గా మారింది. జనరల్‌గానే పవన్ కళ్యాణ్ సినిమాకు క్రేజ్ ఎక్కువ. ఈ క్రమంలోనే ‘బ్రో’ చిత్రంపై ఇండస్ట్రీలో నెలకొన్న పాజిటివ్ బజ్.. క్రేజీ ప్రీ-బిజినెస్ డీల్స్‌కు అవకాశం ఇచ్చింది. ప్రత్యేకించి నైజాం రెట్స్ భారీ ధరకు అమ్ముడుపోవడం విశేషం.
తెలుస్తున్న సమాచారం మేరకు, టాప్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ‘మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పి’.. ‘బ్రో’ మూవీ నైజాం రీజియన్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను రూ. 36 కోట్లకు సొంతం చేసుకుంది. ఇందులో రూ.33 కోట్లు ఎన్ఆర్ఏ ప్రాతిపదికన డీల్ కుదుర్చుకున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో ప్రియా ప్రకాష్ వారియర్, కేతికా శర్మ ఫిమేల్ లీడ్స్‌గా నటించారు.
ఇక పవన్ అప్‌కమింగ్ మూవీస్ విషయానికొస్తే.. హరీష్ శంకర్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’, సుజిత్ డైరెక్షన్లో OG చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయి. ప్రస్తుతం పవన్ ఏపీలో వారాహి యాత్రలో బిజీగా ఉన్నందున ఈ చిత్రాల షూటింగ్ వాయిదా పడుతోంది.