రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) ఛైర్మన్ గా సీనియర్ IAS బుర్రా వెంకటేశంను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సర్కారు పంపిన ఫైల్ పై గవర్నర్ సంతకం చేశారు. ఛైర్మన్ మహేందర్ రెడ్డి పదవీకాలం వచ్చే నెల 3తో ముగియనున్న దృష్ట్యా ఈ నియామకం చేపట్టారు. TGPSC ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టాల్సి ఉన్నందున స్వచ్ఛంద పదవీ విరమణ(VRS) చేయబోతున్నారు బుర్రా వెంకటేశం. ప్రస్తుతం ఈయన విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ప్రస్తుతం IPS మాజీ అధికారి ఛైర్మన్ గా ఉంటే, ఇక నుంచి IAS అధికారి ఉండబోతున్నారు. అయితే VRSకు వెంకటేశం ఎప్పుడు దరఖాస్తు చేస్తారనేది తేలాల్సి ఉంది. TGPSCకి ఘంటా చక్రపాణి తొలి ఛైర్మన్ గా వ్యవహరిస్తే ఆ తర్వాత సీనియర్ IAS జనార్ధన్ రెడ్డి విధులు నిర్వర్తించారు. జనార్ధన్ రెడ్డి కాలంలో ఆరోపణలు రావడంతో కమిషన్ కాస్తా వివాదాస్పదమైంది. రేవంత్ సర్కారు కొలువుదీరిన వెంటనే ఆయన స్థానంలో మాజీ DGP మహేందర్ రెడ్డిని నియమించారు.
It is good info