ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో బెట్టు చేసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్(PCB) ఎట్టకేలకు దిగొచ్చింది. BCCI లేవనెత్తిన హైబ్రిడ్ మోడల్ కు అంగీకరించి ICCకి మూడు షరతులు పెట్టింది. పాకిస్థాన్ లో 2025 ఫిబ్రవరిలో నిర్వహించే ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ రావాల్సిందేనని పట్టుబట్టగా, కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీనిపై భారత బోర్డు ICCకి వివరించి పాక్ వెళ్లేది లేదని కరాఖండీగా చెప్పేసింది. ఎంత చెప్పినా పాక్ వినకపోవడంతో అన్ని దేశాల బోర్డులతో వర్చువల్ సమావేశం నిర్వహించిన ICC… పాక్ మొండివైఖరితో కఠినంగా వ్యవహరించాల్సి వచ్చింది. హైబ్రిడ్ మోడల్ కు అంగీకరించకపోతే టోర్నీ మొత్తాన్ని పాక్ నుంచి తరలిస్తామని వార్నింగ్ ఇచ్చింది. పరిస్థితి చేయి దాటుతుందని గ్రహించిన PCB.. హైబ్రిడ్ మోడల్లో తటస్థ వేదికలకు అంగీకరించి మూడు షరతులు విధించింది.
మూడు కంఢిషన్లు ఇవే…
* గ్రూప్ దశ, సెమీ ఫైనల్స్, ఫైనల్లో టీమ్ఇండియా ఆడాల్సి వస్తే ఆ మ్యాచులను దుబాయ్ లో నిర్వహించాలి.
* ఒకవేళ భారతజట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమిస్తే అప్పుడు సెమీస్ తోపాటు ఫైనల్ మ్యాచులను లాహోర్లో నిర్వహించేందుకు పర్మిషన్ ఇవ్వాలి.
* భవిష్యత్తులో భారత్ నిర్వహించే ICC టోర్నమెంట్లలో పాకిస్థాన్ వెళ్లకుండా తటస్థ వేదికలపైనే మ్యాచులు జరిగేలా చూడాలి.