మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏదో ఒక పథకం(Scheme)పైనా లేదని అభివృద్ధి కార్యక్రమంపైనో వేస్తారు. కానీ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అఖిలపక్ష భేటీ కోసమే ప్రత్యేకంగా కేబినెట్ సబ్ కమిటీ వేసి ఆశ్చర్యపరిచారు CM రేవంత్. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేలా BJP, BRS ప్లానింగ్ తో వస్తే స్వాగతిస్తామని, పాలసీ డాక్యుమెంట్ తీసుకువస్తే భేషజాలు లేకుండా ఆమోదిస్తామని అన్నారు. అఖిలపక్ష భేటీ నిర్వహించేందుకు డిప్యూటీ CM భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తో కూడిన మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి వేదికపైనే ప్రకటించారు.