దాడులు, లూటీలతో అల్లకల్లోలమవుతున్న బంగ్లాదేశ్ లో నివసించడం శ్రేయస్కరం(Safe) కాదని వివిధ దేశాలు అభిప్రాయానికి వస్తున్నాయి. ఆ దేశానికి వెళ్లొద్దంటూ తమ పౌరుల(Citizens)ను బ్రిటన్ హెచ్చరించింది. ఆయుధాలతో బెదిరించి దోపిడీకి దిగడంతోపాటు ఉగ్ర దాడులు జరిగే అవకాశాలున్నాయని తెలిపింది. బంగ్లాదేశ్ లో ఉన్న UK సిటిజన్స్ జాగ్రత్తగా ఉండాలంటూ ఒక అడ్వైజరీ జారీ చేసింది. ఏ ప్రాంతమనే తేడా లేకుండా జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ముఖ్యంగా విదేశీయులు సంచరించే చోట పెద్దయెత్తున దాడులు జరగొచ్చని వార్నింగ్ ఇచ్చింది. ఇస్లాం మతానికి చెందని వ్యక్తులే లక్ష్యంగా దాడులు జరుగుతాయని ఆ దేశ ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు బ్రిటన్ ఈ నిర్ణయం తీసుకుంది.
షేక్ హసీనాను గద్దె దింపాక బంగ్లాలో వాతావరణం అస్తవ్యస్థంగా తయారై శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. ముఖ్యంగా భారతీయుల్ని, అక్కడి మైనార్టీలైన హిందువుల్ని టార్గెట్ చేసుకుని దాడులు చేస్తున్నారు. దీంతో భారత్ సైతం బంగ్లా పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే స్పష్టం చేసింది. భారత్, బ్రిటన్ సహా మరిన్ని దేశాలు సైతం ఇలాంటి నిర్ణయమే తీసుకునే ఆలోచనలో ఉన్నాయి.