సీనియర్ IAS అధికారి బుర్రా వెంకటేశం స్వచ్ఛంద పదవీ విరమణ(VRS) చేశారు. ఆయన పెట్టుకున్న వినతిని ఆమోదిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన్ను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) ఛైర్మన్ గా నియమిస్తూ నవంబరు 30న ప్రభుత్వం ఉత్తర్వులు(Orders) ఇచ్చింది. దీంతో IAS పదవికి స్వచ్ఛంద పదవీ విరమణ చేయాల్సి రాగా.. ఆరోజే వెంకటేశం అప్లయ్ చేసుకున్నారు.