పుష్ప-2 ప్రీమియర్ షో కోసం వచ్చి తొక్కిసలాట(Stampade)లో మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటన వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనపై ఇప్పటికే నటుడు అల్లు అర్జున్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ సహా పలువురిపై కేసులు నమోదయ్యాయి. అల్లు అర్జున్ వస్తున్న విషయం అతడి సిబ్బంది గానీ థియేటర్ యాజమాన్యం కానీ సమాచారమివ్వలేదని సెంట్రల్ జోన్ DCP అన్నారు. ప్రైవేటు సెక్యూరిటీతోనే ఆయన వచ్చారని, సినిమాకు చెందిన కీలక నటులు అటెండ్ అవుతారన్న విషయం తెలియలేదన్నారు. దీనిపై కేసు ఫైల్ చేయడంతోపాటు అల్లు అర్జున్ కు నోటీసులిస్తామన్నారు.
ప్రీమియర్ షోకు తన కుటుంబంతో సహా వచ్చిన రేవతి.. తొక్కిసలాటలో కింద పడిపోయారు. అప్పటికే థియేటర్ కిక్కిరిసిపోగా ప్రేక్షకుల్ని అదుపు చేయడం కష్టమైంది. రేవతితోపాటు ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడగా, ఆమెకు అక్కడికక్కడే పోలీసులు సాయమందించినా ప్రాణాలు దక్కలేదు. ఆమె తనయుడు మాత్రం తీవ్ర గాయాల పాలయ్యాడు.