ప్రొఫెసర్ ఘంటా చక్రపాణికి కీలక బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అంబేడ్కర్(Ambedkar) ఓపెన్ యూనివర్సిటీ(OU) వైస్ ఛాన్సలర్ గా నియమించింది. సోషియాలజీ సీనియర్ ప్రొఫెసర్ అయిన చక్రపాణి VC పోస్టులో మూడేళ్లు ఉంటారని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఆయన నియామకానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈయన పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) ఛైర్మన్ గా పనిచేశారు. KCR హయాంలో చక్రపాణికి అప్పుడు కీలక పదవి దక్కితే కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ముఖ్యమైన పోస్టు లభించింది.