భారత అండర్-19 క్రికెట్ టీమ్ ఆసియా కప్ ఫైనల్లో అడుగుపెట్టింది. షార్జా(Sharjah)లో జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో శ్రీలంకను చిత్తుగా ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న శ్రీలంక 46.2 ఓవర్లలో 173కే ఆలౌటైంది. భారత బౌలర్లు పోటీపడి వికెట్లు తీయడంతో లక్విన్ అబేయ్ సింఘే(69) మినహా ఎవరూ పెద్దగా పరుగులు తీయకుండానే ఔటయ్యారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన టీమ్ఇండియా యువకిశోరాలు(Youngsters) 21.4 ఓవర్లలోనే కేవలం 3 వికెట్ల నష్టానికి 175 స్కోరు చేసి 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకున్నారు. వైభవ్ సూర్యవంశీ(67; 36 బంతుల్లో, 6×4, 5×6) చెలరేగడంతో మ్యాచ్ ఏకపక్షమైంది.
అటు తొలి సెమీఫైనల్ మ్యాచ్ లో పాకిస్థాన్ ను బంగ్లాదేశ్ చిత్తు చేసి భారత్ తో ఫైనల్ కు రెడీ అయింది. పాక్ 37 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌటైతే.. ఆ లక్ష్యాన్ని బంగ్లా 21.1 ఓవర్లలోనే ఛేదించి 7 వికెట్లతో విజయాన్నందుకుంది.