జమిలి ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లే కనపడుతున్నది. 2027లోనే దేశంలో జమిలి ఎన్నికలు(One Election) వచ్చే అవకాశాలుండగా, ఈ శీతాకాల సమావేశాల్లో(Sessions) పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టే సూచనలున్నాయి. మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన రిపోర్టుకు ఆమోదం తెలిపిన సర్కారు.. ఈ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టే ముందు విస్తృత సంప్రదింపుల కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ(JPC)ని నియమించాలన్న ఆలోచనలో ఉంది.
అన్ని ప్రధాన పార్టీలతోపాటు అసెంబ్లీలు, రాష్ట్రాల్లోని మేధావులతో సంప్రదింపులు జరిపేలా JPC ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకే దేశం-ఒకే ఎన్నికకు సంబంధించిన బిల్లును ఆమోదించాలంటే రాజ్యాంగంలో మరో ఆరు సవరణలు తీసుకురావడమే కాకుండా 2/3 మెజార్టీతో ఆమోదించాల్సి ఉంటుంది. 245 మంది సభ్యులు గల ఎగువసభలో NDAకు 112 మంది, ప్రతిపక్షాలకు 85 మంది సభ్యులుండగా.. బిల్లు ఆమోదానికి 164 ఓట్లు అవసరం.