సీనియర్ నటుడు మోహన్ బాబు కుటుంబంలో తలెత్తిన వివాదం(Dispute) రచ్చగా మారి ఇరువర్గాలు ఫిర్యాదులు(Complaints) చేసుకునేదాకా వెళ్తే.. రెండ్రోజులుగా ఇంట్లో జరిగిన చర్చలపై అనుమానాలు కనిపిస్తున్నాయి. న్యాయం జరిగే వరకు ఎక్కడికైనా వెళ్తానని ఇప్పటికే ప్రకటించిన మనోజ్.. ఇప్పటిదాకా జరిగిన పరిణామాల్ని పోలీసు ఉన్నతాధికారులకు వివరించారు. అడిషనల్ DGPతోపాటు ఇంటెలిజెన్స్ DGని సైతం మనోజ్ కలిశారు. తన భార్య మౌనికతోపాటు పిల్లల్ని రక్షించాలంటూ ఇప్పటికే ఆయన కోరారు.
మౌనిక ప్రమేయంపై ఆగ్రహంగా ఉన్న మోహన్ బాబు.. విష్ణుతో జరిగే చర్చల్లో మనోజ్ సతీమణి మౌనిక ప్రమోయాన్ని ఒప్పుకోలేదని ఆయన ఆరోపించారు. తన భార్య పట్ల అలా వ్యవహరించిన తీరుపై ఆగ్రహంతో మనోజ్ సైతం చర్చల నుంచి మధ్యలోనే బయటకు వచ్చారు. ఇలా ఇరువర్గాల మధ్య సమస్య పెద్దది కావడంతో మనోజ్ దంపతులు అంతకుముందు DGPని కలిశారు.