ఉచిత విద్యుత్తు(Power)పై మాట్లాడిన మాటలను వక్రీకరించి అసత్య ప్రచారం చేశారని PCC ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. తన మాటలను ఎడిట్ చేసి BRS తప్పుడు ప్రచారానికి దిగిందని గాంధీభవన్ లో తెలిపారు. ఫ్రీ కరెంటుపై ప్రభుత్వ పెద్దలతో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. మీట్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు అమెరికా వెళ్లానని, ఉచిత విద్యుత్ పై కొందరు ఎక్స్ పర్ట్స్ సందేహాలకు మాత్రమే సమాధానాలు ఇచ్చానన్నారు. బషీర్ బాగ్ కాల్పుల ఘటన సమయంలో KCR తెలుగుదేశంలోనే ఉన్నారని.. ఉచిత విద్యుత్ ఇవ్వడం కుదరదని ఆనాడు కేసీఆరే TDP ప్రభుత్వంతో చెప్పించారని రేవంత్ రెడ్డి గుర్తు చేస్తూ CM వైఖరిపై మండిపడ్డారు.
ముఖ్యమంత్రి YSR తన తొలి సంతకాన్ని ఉచిత విద్యుత్ పైనే చేశారన్న రేవంత్… సాగు రైతులకు 9 గంటల క్వాలిటీ కరెంటు ఇచ్చింది కాంగ్రెసేనన్నారు. ఉచిత విద్యుత్ సబ్సిడీతోపాటు ఇన్ పుట్ సబ్సిడీగా వేల కోట్ల రూపాయలు అందజేసినట్లు వివరించారు.