మీడియా ప్రతినిధుల(Representatives)పై దాడి కేసులో సీనియర్ నటుడు మంచు మోహన్ బాబుకు హైకోర్టులో షాక్ తగిలింది. తనను అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ వేసిన పిటిషన్ ను గురువారానికి వాయిదా వేసింది. దీంతో ఆయన అభ్యర్థనను కోర్టు తిరస్కరించినట్లయింది. జర్నలిస్టుపై దాడి ఘటనలో ఆయనపై కేసు నమోదు కాగా.. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.