భారత్-ఆస్ట్రేలియా టెస్టుకు వర్షం ఆటంకం కలిగిస్తూనే ఉంది. ఐదో రోజు వరుణుడి దెబ్బకు ఆట నిలిపివేయాల్సి వచ్చింది. 252/9తో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన టీమ్ఇండియా.. మరో ఎనిమిది పరుగులు జత చేసి ఆలౌటైంది. అద్భుతంగా ఆడి ఫాలో ఆన్ తప్పించిన ఆకాశ్ దీప్(31) ఔట్ అయ్యాక ఇన్నింగ్స్ బ్రేక్ వచ్చింది. అప్పుడే వాన రావడంతో ఇక మ్యాచ్ జరిగే అవకాశం కనిపించలేదు. స్టీవ్ స్మిత్(101), ట్రావిస్ హెడ్(152) సెంచరీలతో తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 445 పరుగులు చేస్తే.. భారత్ 260కి ఆలౌటై 185 రన్స్ వెనుకబడింది. భారత్ ఇన్నింగ్స్ లో రాహుల్(84), జడేజా(77) రాణించగా, చివర్లో ఆకాశ్ ఆదుకున్నాడు.